జగిత్యాలలో నకిలీ నోట్ల కలకలం.. వీధి వ్యాపారులే టార్గెట్ గా చలామణి...

జగిత్యాల జిల్లా కోరుట్లలో నకిలీ నోట్ల ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు వీధి వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని లక్ష్యంగా నకిలీ నోట్లు అంట కడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తనకిచ్చిన నోటు నకిలీదని గుర్తించిన ఓ పండ్ల వ్యాపారి సీసీ కెమెరా ద్వారా దుండగుడిని గుర్తించారు.

గత రెండు రోజుల వ్యవధిలో  పట్టణంలోని ఓ కొబ్బరి బొండాల వ్యాపారిని, మరో పండ్ల వ్యాపారిని, ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న రొట్టెల అమ్ముకునే మహిళను మోసగించినట్లు పోలీసులు గుర్తించారు.

వీధి వ్యాపారం చేసుకునే వృద్ధులు, మహిళలే టార్గెట్ గా గత రెండు రోజులుగా కథలాపూర్, మెట్పల్లి ప్రాంతాలలో దొంగ నోట్లు అంటగట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఒక్క ఫేక్ నోటు కోసం ఫిర్యాదు చేయడం ఎందుకని ఎవరికి వారే కామ్ గా ఉన్నామని అంటున్నారు వీధి వ్యాపారులు.