ఎస్పీ పేరుతో ఫేక్​ ఫేస్​బుక్​ అకౌంట్ .. ఫోన్​పే చేయాలంటూ మెస్సేజ్​​

సూర్యాపేట: సైబర్​ నేరగాళ్లు ఏకంగా ‘ఎస్పీ సూర్యాపేట’ పేరుతో ఫేస్​బుక్​అకౌంట్ ఓపెన్ చేశారు. పోలీసులను బురిడీ కొట్టించడానికి ఏకంగా ఎస్పీ పేరునే వాడుకున్నారు. సూర్యాపేట ఎస్పీ ​రాహుల్ హెగ్డే పేరుతో నకిలీ ఫేస్​బుక్​ అకౌంట్​ను సైబర్​ నేరగాళ్లు ప్రారంభించారు. ఆ ఆ అకౌంట్​నుంచి ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు పంపించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు.  జిల్లాలో ఇప్పటికే పలువురి ఎస్ఐ, సీఐలు, ప్రముఖులకు నకిలీ ఫేస్​బుక్​ ఖాతా ద్వారా ఎస్పీ రాహుల్ హేగ్డే ​ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్  వచ్చింది. ఎస్పీ కదా అని చాలా మంది రిక్వెస్ట్ ఒకే చేస్తున్నారు. కొద్దీ సేపటికే మెస్సెంజర్​లో చాటింగ్ ప్రారంభించి  'మీతో ఓ అవసరం పడింది. కొంత మొత్తం నగదు కావాలి.. ఫోన్ పే చేస్తే రేపే తిరిగిచ్చేస్తా.. అంటూ మెసేజ్ చేస్తున్నారు. అనుమానంతో కొంత మంది  పోలీసులకు, ఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే ఎస్పీ అప్రమత్తమయ్యారు. ‘ఎస్పీ సూర్యాపేట’ ఖాతా నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కోరారు. తన పేరుపై ఉన్నది ఫేక్ ఖాతా అని, అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపించవదద్దని ఎస్పీ ప్రకటన విడుదల చేశారు.

Also read : కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ .. ఢిల్లీలో ధర్నా చెయ్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి