హెల్త్ క్యాంప్ పెట్టిన నకిలీ వైద్యులు.. పోలీసులు వచ్చేసరికి పరార్

ఓ ప్రైవేటు కంపెనీ పేరుతో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకున్నారు నకిలీ వైద్యులు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో ఫేక్ డాక్టర్లు కలకలం సృష్టించారు. కేవా కైపో ఇండస్ట్రీస్ పేరుతో న్యూట్రీషియన్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి.. బీపీ, షుగర్ అంటూ ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు 3 వేల రూపాయలు వసూలు చేశారు. అనుమానం వచ్చి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితులు పరారయ్యారు. అయితే ఇస్సాపల్లిలో హెల్త్ క్యాంపు ఏర్పాటుకు తాము అనుమతివ్వలేదని తెలిపారు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ALSO READ :- క్యాబ్ దోపిడీ : పూణె నుంచి బెంగళూరుకు రూ.3 వేల 500.. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి రూ.2 వేలు