Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ను షేక్ చేసిన మెనగాడు ఇతడేనా? క్రౌడ్‌స్ట్రైక్ ex ఎంప్లాయ్ అంటూ

మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్లు శుక్రవారం ఆరు గంటలకు పైగా డౌన్ అయ్యాయి. వరల్డ్ వైడ్ కొన్ని విమానాశ్రాయాలు, బ్యాకింగ్ సేవలు, స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. టెక్ కంపెనీల ఉద్యోగులు కంప్యూటర్లలో బ్లూ స్ర్కీన్ ఎర్రర్ చూసి తలలు పట్టుకున్నారు. కొన్ని గంటలపాటు అల్లకళ్లోలం అయ్యింది. వీటన్నిటికి నేనా కారణం అంటూ ఓ వ్యక్తి X లో పోస్ట్ చేశాడు.

క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ మాజీ ఉద్యోగినని, తాను కావాలనే రాంగ్ అప్‌డేట్ పంపానని చెప్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే అతని పేరు విన్సెంట్ ఫ్లిబస్టియర్.. వెంట వెంటనే అతను సోషల్ మీడియాలో చేసిన పోస్టులు ఇంటర్నెట్ లో కాసేపు హైడ్రామాని సృష్టించాయి. 

విన్సెంట్ క్లౌడ్ స్ట్రైక్ ఆఫీస్ లో ఫస్ట్ డే అంటూ శుక్రవారం మధ్యాహ్నం ఓ ఫొటో ఎక్స్ లో షేర్ చేశాడు. అదే రోజు సాయంత్రం నేను క్రౌడ్ స్ట్రైక్ లో ex ఎంప్లాయ్ అంటూ.. విన్సెంట్ ఫ్లిబస్టియర్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వర్లను ఎందుకు ఇలా చేశాడో చెప్తూ మరో వీడియో ట్విటర్ లో పోస్ట్ చేశాడు. దీంతో అతని వీడియో లక్షల్లో షేర్లు.. ఫుల్ వైరల్ అయ్యాడు. తర్వాత ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ.. నీ దగ్గర నాకో జాబ్ కావాలి ఇస్తావా అని అడుగుతూ మరో పోస్ట్ చేశాడు.

ఇలా గంటల వ్యవధిలోనే విన్సింట్ ఫ్లిబస్టియర్ ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యాడు. తర్వాత తెలిసిన విషయం ఏటంటే.. అవి ఏఐతో జనరేట్ చేసిన ఫేక్ ఫోస్టులని నెటిజన్లు కనిపెట్టారు. దీంతో అతనిపై చాలామంది మండిపడ్డారు. చివరికి విన్సింట్ ఫ్లిబస్టియరే ఓప్పుకున్నాడు.. అది ఫేక్ ఫొటోస్ అని.. ఫేమస్ అవ్వడానికే అతడు అలా చేశానని తేలిపోయింది. నిజానికి విన్సెంట్ ఫ్లిబస్టియర్ నార్డ్  ప్రెస్ అనే ఓ వార్త వెబ్ సైట్ ఓనర్. అతను పేమస్ కావాడానికే మైక్రోసాఫ్ట్ సర్వర్లను క్రాష్ చేశానని చెప్పుకున్నాడు.