కరీంనగర్ క్రైం, వెలుగు : రైతులకు అమ్మేందుకు తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పూర్ క్రాస్ రోడ్ దుర్శేడ్ వద్ద టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, రూరల్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన చందు నాగేశ్వరరావు మంచిర్యాల జిల్లా భీమారంలో ఉంటున్నాడు.
అతడు రైతులకు అమ్మేందుకు పత్తి విత్తనాలు తరలిస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు దుర్శేడు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ టైంలో అటు వైపు వచ్చిన నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని తనికీ చేయగా రూ. 1.20 లక్షల విలువైన 60 కిలోల నకిలీ పత్తివిత్తనాలు దొరికాయి. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఇన్స్‌పెక్టర్ ప్రదీప్‌కుమార్ చెప్పారు. తనిఖీల్లో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ సృజన్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ రవీందర్, కరీంనగర్ రూరల్ ఎస్సై శేఖర్ పాల్గొన్నారు.