పోతార్రా రే పోతారు.. : రక్తాన్ని కూడా నకిలీ చేసేశారా.. రూ.7 వేలకు అమ్మేశారు..

అన్నింటి కంటే గొప్పదానం రక్తదానం.. కొందరు దుర్మార్గులు దాన్ని కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ మెడికల్ కాలేజీలో ఫేక్ బ్లడ్ తయారు చేసి రోగులకు సరఫరా చేస్తున్నారు. డోనర్స్ నుంచి తీసుకున్న బ్లడ్ ను మార్చి దాని ప్లేస్ లో ఫేక్ బ్లడ్ పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ఈ షాకింగ్ న్యూస్ బయటకు రాగానే హాస్పిటల్, రోగుల భద్రత, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల మీద సామాన్య ప్రజల్లో ఆందోళనలను పెరుగుతుంది.

ట్రీట్‌మెంట్ కోసం ఆసుపత్రిలో చేరిన కృష్ణ మురారికి ఎమర్జెన్సీగా బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. అతని బంధువు కౌశల్ కిషోర్ మిశ్రా డోనర్ కోసం వెతికాడు. రూ.7 వేలకు ఒక యూనిట్ రక్తాన్ని ఇవ్వడానికి ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. కుటుంబసభ్యులు రక్తాన్ని సేకరించి వైద్య కళాశాలకు తరలించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ గంటసేపు లేట్ అయ్యిందని రక్తమార్పిడిని నిరాకరించాడు. తర్వాత బ్లడ్ యూనిట్ ను భద్రంగా ఉంచేందుకు ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ లో భద్రపరిచారు.
తర్వాతి రోజు ఉదయం డోనర్ నుంచి తీసుకున్న బ్లడ్ తీసుకొని రోగి కావాల్సిన గ్రూప్ ఇవ్వాలని హాస్పిటల్ ను అడిగారు. బ్లడ్ బ్యాంక్ సిబ్బంది హాస్పిటల్ వాళ్లు ఇచ్చిన బ్లడ్ శ్యాంపిల్ చూసి షాక్ తిన్నారు. బ్లడ్ బ్యాగ్, దానికి అటాచ్ చేసిన స్లిప్ రెండూ ఫేక్ అని తేలింది. అందులో హిమోగ్లోబిన్‌లో చాలా లోపం ఉన్నట్లు బయటపడింది. ఇది ఎక్స్ ఛేంజ్ చేయడానికి కూదరదని చెప్పారు. బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సకాలంలో జోక్యం చేసుకోవడంతో రోగికి ఆసుపత్రిలో స్టోర్ చేసిన సురక్షితమైన యూనిట్ రక్తం అందేలా చేసింది.

ALSO READ | Viral Video: ఇతని ధైర్యం, ముందుచూపుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే..కాటువేసిన పామును ఆస్పత్రికి పట్టుకెళ్లాడు

బ్లడ్‌ యూనిట్‌ ట్యాంపరింగ్‌, అవకతవకలు జరిగినట్లు విచారణలో తేలిందని బ్లడ్‌బ్యాంకు ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌ చెప్పారు. బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జేకే వర్మ హామీ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఈ పని చేసిన ముఠాను బయటపెట్టి అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు ఆయన.