అదిరేటి అందం కోసం.. ముఖం దీపంలా వెలగాలంటే.. పాటించాల్సిన చిట్కాలు ఇవే. . .

వేడుకల్లో వెలగాలంటే, ముఖానికి వేసే మేకప్‌ వేడుకకు తగ్గట్టుగా ఉండాలి. సందర్భం, సమయం, దరించే దుస్తుల ఆధారంగా టిప్స్‌ పాటించాలి. ప్రస్తుతం చాలా మంది ముఖం గ్లో మెయింటెయిన్ చేయడానికి వివిధ రకాల చిట్కాలను వినియోగిస్తున్నారు. ..పండుగకు నేచురల్ గా  ముఖాన్ని మెరిపించాలంటే..ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు  తెలుసుకుందాం . . ..

అరటిపండు, పాలు 

పాలు, అరటిపండు ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది.  అరటిపండుని గుజ్జులా చేసి అందులో కొన్ని పాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరిన తరువాత చల్లని నీళ్లతో వాష్ చేసుకోవాలి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్ లో దూది ముంచి ముఖాన్ని క్లీన్ చేయాలి. ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ ముఖాన్ని లోపలనుంచి శభ్రపరచి గోల్డెన్ గ్లో ఇస్తుంది. మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది.

నిమ్మరసంతో...

రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక స్పూన్ చక్కెర కలపాలి. దాన్ని ముఖానికి స్క్రబ్ లా రాయాలి.  పది నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడగాలి.  ఇది ముఖంలోని మురికి జిడ్డును పొగొడుతుంది. 

సన్ స్క్రీన్

మేకప్‌ ముందు మాయిశ్చరైజర్‌, సన్ స్క్రీన్ లను తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. వీటితో వేడుకల్లో లైట్ల వెలుగుకు చర్మం కమిలిపోకుండా ఉంటుంది.

రెండు అంచెల్లో...

ఫ్లాష్‌ ఫొటోల్లో ముఖం అవసరానికి మించి వెలిగిపోకుండా ఉండాలంటే, రెండు భిన్నమైన ఫౌండేషన్లు వేసుకోవాలి. ఇందుకోసం మ్యాటి, సాఫ్ట్‌ గ్లోయీ రకాలకు చెందిన ఫౌండేషన్లను కలిపి అప్లై చేసుకోవాలి. జిడ్డు చర్మమైతే, నుదురు, ముక్కు, చుబుకం మీద మ్యాటి ఫౌండేషన్‌, మిగతా ముఖం మొత్తం డ్యూయీ ఫౌండేషన్‌ అప్లై చేసుకోవాలి. తర్వాత లూజ్‌ పౌడర్‌ అద్దుకోవాలి.

బ్లష్‌ కీలకం

పగటి వేళ వేడుకలకు హాజరయ్యేటప్పుడు ముదురు రంగు బ్లష్‌లకు బదులుగా, సహజసిద్ధంగా కనిపించే న్యాచురల్‌ లేదా రోజీ బ్లష్‌ ఎంచుకోవాలి. బుగ్గలతో పాటు, కొద్దిగా ముక్కు, చుబుకం మీద కూడా లైట్‌గా బ్లష్‌ను అద్దుకోవాలి.

ఐ షాడో ఇలా..

ముఖం మొత్తంలో కళ్లూ, పెదవులే ఫోకల్‌ పాయింట్లు. కాబట్టి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. పగలైనా, రాత్రైనా ముదురు రంగు షాడోలకు దూరంగా ఉండాలి. పేస్టెల్‌, సాఫ్ట్‌ మెటాలిక్‌ ఐ షాడోలనే ఎంచుకోవాలి. ముడతలు పడకుండా ఉండడం కోసం క్రీమీ షాడోలకు బదులుగా పౌడర్‌ ఐ షాడోలనే ఎంచుకోవాలి. పౌడర్‌ ఐ షాడోలు మేక్‌పలో చక్కగా కలిసిపోయి, ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటాయి.

ALSO READ :  Good Health : రోజూ వాడే తువ్వాళ్లు ఇట్ల వాడాలె

లవ్లీ లిప్‌స్టిక్‌

ఎరుపు, ప్లమ్‌, మెరూన్‌ మొదలైన రంగు లిప్‌స్టిక్స్‌ వేడుకలకు బాగుంటాయి. అలాగే ఐ షాడోకు మ్యాచ్‌ అయ్యే లిప్‌స్టిక్‌ ఎంచుకోవడం మర్చిపోకూడదు. గ్లిట్టర్‌, పేస్టెల్‌, మోనోటోన్‌ రంగు లిప్‌స్టిక్స్‌ పగటి వేడుకులకు సూటవుతాయి. మెటాలిక్‌, ముదురు రంగు షేడ్స్‌ రాత్రి వేడుకలకు మ్యాచ్‌ అవుతాయి.