చైనాతో బార్డర్ సమస్యలు 75శాతం పరిష్కారం: జైశంకర్

జెనీవా: చైనాతో సరిహద్దు సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. దాదాపు 75 శాతం సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు. ద్వైపాక్షిక సమావేశాల కోసం స్విట్జర్లాండ్‌‌లోని జెనీవా పర్యటనలో ఉన్న జైశంకర్.. గురువారం గ్లోబల్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ పాలసీపై సమావేశంలో మాట్లాడారు. 

అయితే, బార్డర్​లో రెండు దేశాలు ఆర్మీని భారీ స్థాయిలో మోహరించడమే పెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. జూన్ 2020 నాటి గల్వాన్  ఘర్షణలు భారత్, -చైనా సంబంధాలను పూర్తిగా ప్రభావితం చేశాయన్నారు.

 కాగా, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌‌బాక్ మాట్లాడుతూ.. ఇండియాలో  యూపీఐ చెల్లింపులు అద్భుతమని ప్రశంసించారు. రెండేండ్ల క్రితం ఇండియాలో రాయబారిగా పని చేశాను. ప్రజలు యూపీఐ ద్వారా ప్రజలు కిరాణా సామాన్లు కొనడం నన్ను ఆకట్టుకుంది. జర్మనీలో ఇది అసాధ్యం అని నేను అనుకున్నాను”అని ఆమె పేర్కొన్నారు.