పీజీ ఎగ్జామ్​ ఫీజు గడువు పొడగింపు

డిచ్​పల్లి, వెలుగు : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల ఎగ్జామ్​ ఫీజు చెల్లింపు గడువు పొడగించినట్లు సీవోఈ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ, ఐఎంబీఏ కోర్సుల 10వ సెమిస్టర్​ రెగ్యూలర్, బ్యాక్​లాగ్​ఎగ్జామ్స్​ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్​ 1వ తేదీ వరకు ఉండగా రూ.100 లేట్​ఫీజుతో 4వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.

ఆయా కోర్సుల బ్యాక్​లాగ్స్​కు ఒక్క సబ్జెక్ట్​కు రూ.250‌‌, రెండు సబ్జెక్టులకు రూ.500, అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్​ ఉంటే రూ. 800 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్​సైట్​ను సంప్రదించాలని ఆమె సూచించారు.