ఎవరో వెంటపడి తరుముతున్నట్లు... తమకు బాగా కావలసిన వాళ్లు ఆపదలో ఉన్నట్లు... అందరి ముందు న్యూడ్ గా కనిపిస్తున్నట్లు... రాయాల్సిన ఎగ్జామ్ రాయలేకపోయినట్లు... లాంటి కలలు చాలామందికి తరచూ వస్తుంటాయి. అలాగే తాము రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లు... కాలేజీ ఫస్ట్ వచ్చినట్లు... సినిమా స్టార్ అయినట్లు కూడా వస్తుంటాయి.
ఇలా మీకు వచ్చే కలలన్నీ.... మీ మానసిక పరిస్థితిని బట్టే వస్తుంటాయి. అయితే ఆనందాన్నిచ్చే కలలు మాత్రమే రావాలంటే, మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఇటీవల లండన్లో కొందరు పరిశోధకులు మూడు వారాల పాటు కొంతమందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని తేల్చారు. బాధ, భయం, ఆందోళనతో ఉన్నవారికి... వచ్చే కలలు కూడా భయానకంగానే ఉంటాయట. కాబట్టి హ్యాపీగా ఉండి స్వీట్ డ్రీమ్స్ ని సొంతం చేసుకోండి.