సిరికొండ మండలంలో నాటుసారా అమ్ముతున్న ఐదుగురు బైండోవర్

సిరికొండ, వెలుగు : సిరికొండ మండలంలోని నాటుసారా విక్రయిస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ ఆఫీసర్లు తహసీల్దార్ రవీందర్ ఎదుట బైండోవర్ చేశారు.  పార్లమెంట్​ఎలక్షన్​ టైంలో సర్పంచ్​తండాకు  చెందిన బదావత్​ రాములు, భుక్యారేణు, భూక్య చమిలి, సర్పల్లి తండాకు చెందిన బోదాసు నర్సయ్య

ఒడ్డెర కాలనీకి చెందిన పిట్ల లక్ష్మీ అక్రమంగా నాటు సారా విక్రయించినందుకు బైండోవర్ చేశామని ఎక్సైజ్​హెడ్​కానిస్టేబుల్​ దత్తాద్రి అన్నారు. అక్రమంగా ఎవరూ నాటుసారా విక్రయించినా తయారు చేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దార్ హెచ్చరించారు.  కార్యక్రమంలో సిబ్బంది సుధీర్​ తదితరులు ఉన్నారు.