కోతలకు వచ్చిన రైతు బంధు ఇవ్వలేదు:హరీష్రావు

కామారెడ్డి: పంటలు కోతలకు వచ్చే సమయం వచ్చినా రైతు బంధు ఇవ్వలేదు..పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని 4 ఎకాలకు వరకు రైతుబంధు ఇచ్చారని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరువు కూడా వచ్చింది.. 100 రోజుల పాలనలో 280 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు హరీష్ రావు. 

కామారెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. గులాబీ జెండాకు ఊపిరి పోసిన ప్రాంతం ఇది.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. హామీలు అన్నీ అమలు కావాలంటే కర్రు కాల్చి వాతపెట్టాల్సిందే అన్నారు. డిసెంబర్ 3న అధికారం చేపట్టిన కాంగ్రెస్ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు.. ఇప్పటివరకు చేయలేదు.. క్రాప్ లోన్ కట్టాలని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇస్తామంటున్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదపన్నారు హరీస్ రావు. 

ALSO READ | కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య

మైనార్టీలను కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందన్నారు హరీష్ రావు. పార్లమెంట్  ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి బుద్ధిచెప్పాలన్నారు. లీకులు, ఫేక్ వార్తలతో గాసిప్స్ ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్టున్నారని ఆరోపించారు. మా నాయకులను కొనవచ్చు గానీ,, మా కార్యకర్తలను తెలంగాణ ఉద్యమ కారులను కొనలేవు అని అన్నారు. వడగళ్ళ వాన పడి నష్టపొతే పరామర్శించిన దాఖలాలు లేవని హరీష్ రావు విమర్శించారు. 

దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు హరీష్ రావు. రాముడు అందరికి దేవుడే.. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు.