ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ రాజ కీయాల్లో ట్విస్ట్ నెలకొంది. ఆరాష్ట్ర మాజీ సీఎం, జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా సమక్షంలో ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మె ల్యేలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకోను న్నట్లు సమాచారం. కాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇటీవల జైలుకు వెళ్లిన ప్పుడు సీఎం బాధ్యతలు చంపై చూసుకున్న విషయం తెలిసిందే.
నేను పార్టీ మారడం లేదు వ్యక్తిగత పనికోసమే హస్తినకు వచ్చా: చంపై సోరెన్
తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వా ర్తలను జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే చంపై సోరెన్ కొట్టిపారే శారు. తాను ఢిల్లీలో ఎవర్నీ కలవలేదన్నా రు. వ్యక్తిగత పనితో పాటు తన పిల్లలను కలిసేందుకే ఢిల్లీకి వచ్చానన్నారు. ప్రస్తు తం ఎక్కడ ఉన్నానో జీవితాంతం అక్కడే ఉంటానంటూ పార్టీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యా నించారు.