ఖలిస్తానీ ఉగ్రవాది హత్య కేసు కుట్ర.. ఇంటెలిజెన్స్ మాజీ అధికారిపై యూఎస్ కేసు

న్యూయార్క్: న్యూయార్క్ లో  నివసిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు కుట్రపన్నారని భారత్కు చెందిన ఇంటెలిజెన్స్ మాజీ అధికారి నిఖిల్ గుప్తాపై అమెరికా అభియోగాలు మోపింది. ఈ మేరకు యూఎస్  న్యాయ శాఖ అతనిపై హత్య,  మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది. ఆ అధికారి  గతంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ తో కలిసి పనిచేశారని ఆరోపించింది.

ALSO READ | సద్గురుకు సుప్రీం కోర్టులో ఊరట.. ఈషా ఫౌండేషన్పై కేసు కొట్టివేత

యూఎస్ -కెనడియన్ పౌరుడు అయిన పన్నూన్‌పై హత్యాయత్నానికి కోఆర్డినేషన్  చేశారని తెలిపింది. అయితే గురుపత్వంత్ సింగ్ ను భారత్ లో ఉగ్రవాదిగా ప్రకటించారు. ఖలిస్తానీ  సంస్థకు అతను అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. "యుఎస్‌లో నివసిస్తున్న రాజ్యాంగ బద్ధమైన పౌరుల హక్కులను కాపాడేందుకు, రక్షించేందుకు తాము ఉన్నామని, అలాంటి వారిపై ప్రతీకారం తీర్చుకోవడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటాన్ని ఎఫ్బీఐ సహించదు" అని ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఒక ప్రకటనలో తెలిపారు.