పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం

  • సీసీ కెమెరాలో రికార్డు 

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుత పులి సంచరించినట్టు ఆధారాలు లభించాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. కొద్ది రోజుల కింద రేగడి మద్దికుంట, ఉప్పరపల్లి గోపరపల్లి గ్రామాల్లో చిరుత పులి పాదముద్రలను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి పొత్కపల్లిలోని రైల్వే గేట్ పక్కన ఖలీల్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలింగచా  చిరుత కనిపించింది.

అలాగే పెద్ద చెరువు సమీపంలోనూ చూసినట్టు కొందరు గ్రామస్తులు తెలిపారు. రేంజ్ ఆఫీసర్ నాగయ్య, సెక్షన్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.