కరీంనగర్ జిల్లాలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం

కరీంనగర్/పెద్దపల్లి, వెలుగు : పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్  స్వాత్రంత్య సంబురాలకు సిద్ధమయ్యాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జగిత్యాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లిలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. 

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జెండా ఎగురవేయనున్నారు. బుధవారం రాత్రి ఆయా జిల్లాల కలెక్టర్లు వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.