జమ్మూకాశ్మీర్లో ఓడిన చీఫ్​లు వీళ్లే..

జమ్మూ, న్యూఢిల్లీ: జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మునుపెన్నడూ లేని విధంగా 29 స్థానాల్లో గెలుపొందినప్పటికీ.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా మాత్రం ఓడిపోయారు. రాజౌరీ జిల్లాలోని నౌషెరా అసెంబ్లీ స్థానంలో 27,250 ఓట్లు సాధించిన రైనా.. నేషనల్ కాన్ఫరెన్స్‌‌కు చెందిన సురిందర్ చౌదరి చేతిలో 7,819 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 

చౌదరి మొత్తం 35,069 ఓట్లు సాధించారు. కాగా, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ భాన్ ఓడిపోయారు. హోడల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా.. బీజేపీ అభ్యర్థి హరీందర్ సింగ్ చేతిలో 2,500 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 

ఉదయ్ భాన్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హోడల్ సీటు నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన జగదీశ్ నాయర్ చేతిలో ఓడిపోయారు. 2022 నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్‌‌గా పనిచేస్తున్నారు.