Good Food : చీట్మీల్స్ బ్యాలెన్స్ చేసేందుకు..!

రోజూ ఒకేరకం ఫుడ్ తినడం చాలామందికి ఇష్టముండదు. డైట్ పాటిస్తున్న వాళ్లు కూడా అప్పుడప్పుడు రొటీన్ ఫుడ్ బదులు నచ్చిన తిండి తింటారు. ఒకటి రెండుసార్లు చీట్ మీల్స్ ఓకే. అయితే చీట్ మీల్స్ కి అలవాటు పడితే డైట్ ప్లాన్ కంటిన్యూ చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండేందుకు న్యూట్రిషనిస్ట్ త్రిషా అగర్వాల్ చెబుతున్న టిప్స్ కొన్ని....

  • చీట్ మీల్స్ చేసిన తర్వాత తొందరగా ఆకలి వేయదు. అప్పుడు దాదాపు 16 గంటలు ఫాస్టింగ్ ఉండాలి. దాంతోమళ్లీ డైట్ ప్లాన్ ని కంటిన్యూ చేసేయొచ్చు.
  • చీట్ మీల్స్ తింటే ఇన్సులిన్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే మరుసటి రోజు కూరగాయలు, ప్రొటీన్ ఎక్కువ ఉండేవి తినాలి. ఇలాచేస్తే ఇన్సులిన్ లెవల్స్ తగ్గుతాయి. 
  • క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ చీట్ మీల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫైబర్ ఉన్న ఫుడ్ పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది.
  • చీట్ మీల్స్ లో ఎక్కువగా స్వీట్లు, ఫారస్ట్ ఫుడ్ చిప్స్ వంటివి ఉంటాయి. వీటిల్లో సోడియం, షుగర్ ఎక్కువ. ఈ రెండూ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. వీటిని బయటికి పంపించడానికి రెండు లేదా రెండున్నర లీటర్ల నీళ్లు తాగాలి.
  • డైట్ ప్లాన్ లోని ఫుడ్ కంటే చీట్ మీల్స్ తిన్నప్పుడు ఎక్కువ క్యాలరీలు అందుతాయి.
  • ఈ అదనపు క్యాలరీలను కరిగించేందుకు వాకింగ్, రన్నింగ్ వంటి ఎక్సర్ సైజ్ లు చేయాలి.