బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల‌ రాకేశ్ రెడ్డి 

నల్గొండ, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల‌ రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కేటీఆర్ స‌మక్షంలో  2023, న‌వంబ‌ర్ 4న రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా చింతపండు నవీవ్ అలియస్ తీన్మార్ మల్లన్న పేరు ప్రకటించారు. ఈరోజు ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.

2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా ఉప ఎన్నికలు వచ్చాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మే 9 వరకూ కొనసాగనుంది. మే 13వ తేది వరకూ నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉండగా, ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.