బాన్సువాడలో కాంగ్రెస్ కే మెజార్టీ వస్తుంది : ఏనుగు రవీందర్ రెడ్డి

కోటగిరి, వెలుగు: రాబోయే ఎంపీ ఎలక్షన్‌‌లో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ  మెజార్టీ రావడం ఖాయమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోటగిరి, పోతంగల్ మండలాల్లో మంగళవారం ఎన్నికల పర్యటనలో ఆయన పాల్గొన్నారు. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎత్తొండలో బీఆర్‌‌‌‌ఎస్ గ్రామ అధ్యక్షుడితో సహా 200 మంది, యాద్గార్ పూర్  గ్రామంలో 150 మంది మైనారిటీ యువకులు కాంగ్రెస్‌‌లో చేరారు. 

కొత్తపల్లి, దేవుని గుట్ట తాండ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లు, లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  మండల వ్యాప్తంగా దాదాపు 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ 80 శాతం  ఖాళీ అయిందన్నారు.  కోటగిరి, పొతంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షాహిద్, పుప్పాల శంకర్, తెలంగాణ రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షులు సోమశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.