కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల నిరసన

రాజన్న సిరిసిల్ల/ జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : వికారాబాద్ కలెక్టర్, కడా చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిబ్బంది పై ఈనెల 11న  జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కలెక్టరేట్ ఉద్యోగులు తెలిపారు. గురువారం రాజన్నసిరిసిల్ల, జగిత్యాల కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు లంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైంలో నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలిపారు. సిరిసిల్లలో ఉద్యోగ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ  ప్రభుత్వ ఉద్యోగులపై  దాడి అత్యంత హేయమన్నారు.

జగిత్యాలలో ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులపై దాడి చేసిన వారిపై పీడీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.