కొందరు వాట్సాప్‌లో ఎమోజీలు తెగ వాడతారు. మెసేజ్‌లకు షార్ట్‌కట్‌లో సమాధానం ఇవ్వాలంటే టక్కున ఎమోజీలను నొక్కే అలవాటు ఉంటుంది చాలామందికి. ఇప్పుడు ఈ ఎమోజీలు జీమెయిల్‌కి కూడా వచ్చేశాయి.
ఆండ్రాయిడ్ ఫోన్లలో జీమెయిల్ యాప్‌లో ఎమోజీలు అందుబాటులోకి రాబోతున్నాయి. తర్వాతి రోజుల్లో వెబ్, ఐఒఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తాయి. మెయిల్ రాగానే రిప్లై మెయిల్ ఇవ్వడానికి కొన్నిసార్లు టైం పట్టొచ్చు. అలాంటప్పుడు ఎమోజీలు ఉపయోగపడతాయి. ఇ–మెయిల్ కింద ‘యాడ్ ఎమోజీ రియాక్షన్’ బటన్ ఉంటుంది. దాంతో నచ్చిన ఎమోజీని సెలక్ట్ చేసి, యాడ్ చేయొచ్చు. గ్రూప్ మెయిల్స్‌కి అయితే ‘ఎవ్రీ వన్స్ రియాక్షన్స్’ సెలక్ట్ చేయాలి.
అయితే గ్రూప్‌లో ఇరవై కంటే ఎక్కువమంది ఉంటే ఎమోజీ రియాక్షన్ ఇవ్వడం కుదరదు. ఎమోజీలతో రియాక్షన్ ఇచ్చిందెవరో తెలుసుకోవాలంటే దాని మీద కాసేపు నొక్కి పట్టాలి. అవసరమైతే అదే రియాక్షన్‌ని గ్రూప్‌లో ఇతరులకు పంపించొచ్చు. మోర్ బటన్ మీద నొక్కితే త్రెడ్‌లో ఉన్న ఏ మెసేజ్‌కైనా ఎమోజీని జత చేయొచ్చు.
స్మార్ట్ ఫీచర్స్‌తో ఫోన్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే ఫీచర్ ఫోన్స్ లాంచ్ చేసింది. అవి చాలా పాపులర్ అయ్యాయి కూడా. అయితే, ఇప్పుడు లేటెస్ట్గా మరో ఫోన్ వచ్చింది. దాని పేరు ‘జియో ఫోన్ ప్రైమ 4జీ’. దీన్ని జియో కంపెనీ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ఎగ్జిబిట్ చేసింది. ఇది ఫీచర్ ఫోన్ అయినా, ఇందులో ప్రీమియం డిజైన్ వాడారు. ఈ ఫీచర్ ఫోన్లో సోషల్ మీడియా యాప్‌లు చాలా ఉంటాయి. ఈ ఫోన్‌ని దీపావళి పండుగకల్లా మార్కెట్లోకి తీసుకువస్తుందట కంపెనీ.
ఢిల్లీ, ముంబై సహా మెయిన్ సిటీల్లో ఈ 4జీ ఫీచర్ ఫోన్ డెలివరీ చేయనున్నట్లు జియో మార్ట్ చెప్పింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ఎల్లో, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే జియో మార్ట్ ఇ–కామర్స్ వెబ్సైట్లో జియో ఫోన్ ప్రైమ 4జీ అందుబాటులో ఉంది. లాంచింగ్‌కి క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్లతో పాటు కూపన్లు కూడా ఇస్తుందట.
ఫోన్ గురించి..
జియో ఫోన్ ప్రైమ 4జీ ఫోన్ డిస్ప్లే 2.4 అంగుళాలు ఉంటుంది. 320 *240 రిజల్యూషన్ పిక్సెల్స్ ఉంటాయి. దీనికి పలుచటి ఫిల్మ్ ట్రాన్సిస్టర్ లిక్విడ్ క్రిస్టల్ (టీఎఫ్టీ) డిస్ప్లే ఉంది. ఈ ఫీచర్ వల్ల ఇమేజ్ క్వాలిటీ బాగా కనిపిస్తుంది. అలాగే ఫోన్ వెనక ప్యానెల్ పై రెండు సర్కిల్స్ కనిపిస్తాయి. దాని లోపల జియో లోగో ఉంటుంది. ఇది జియో నుంచి వచ్చిన kaiOS ఆధారంగా పనిచేస్తుంది. అలాగే ఇది సింగిల్ సిమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ఎఆర్ఎమ్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్ ఉంది. ఇందులో128జీబీ మైక్రో ఎస్డీ కార్డ్‌ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఇస్మార్ట్ ఫీచర్స్
- ఈ ఫోన్‌కి 4జీ కనెక్షన్ సపోర్ట్,1800ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది.
- ఇరవై మూడు భాషలు ఉంటాయి.
- ఇందులో 0.3 ఎం.పి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్లూటూత్ వెర్షన్ 5.0 కూడా అందుబాటులో ఉంది.
- ఎఫ్ఎమ్ రేడియోతోపాటు 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌కు సపోర్ట్ చేస్తుంది.
- వాట్సాప్, జియో చాట్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా యాప్‌లు కూడా ఉంటాయి.
- స్మార్ట్ ఫోన్లో లాగానే ఈ ఫోన్లో యూట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ వాడొచ్చు.
- ఈ ఫోన్ ధర 2,599 రూపాయలుగా రిలయన్స్ జియో ప్రకటించింది.
- ఈ ఫోన్‌కు ఒక ఏడాది వారంటీ ఇస్తోంది జియో కంపెనీ.