పాకిస్తాన్‌‌‌‌పై కుర్రాళ్ల పంజా.. ఎమర్జింగ్ ఆసియా కప్‌‌‌‌లో ఇండియా శుభారంభం

  • ఎమర్జింగ్ ఆసియా కప్‌‌‌‌లో ఇండియా శుభారంభం

  • రాణించిన కెప్టెన్ తిలక్‌‌‌‌, అన్షుల్‌‌‌‌

అల్‌‌‌‌ అమెరాట్‌‌‌‌: ఏసీసీ ఎమర్జింగ్‌‌‌‌ టీమ్స్‌ టీ20 ఆసియా కప్‌‌‌‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌పై ఇండియా కుర్రాళ్లు పంజా విసిరారు. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో ఆకట్టుకున్న ఇండియా–ఎ.. దాయాదిని ఓడిస్తూ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌‌‌‌లో తిలక్‌‌‌‌ వర్మ (44), ప్రభ్‌‌‌‌సిమ్రన్‌‌‌‌ సింగ్‌‌‌‌ (36), అభిషేక్‌‌‌‌ శర్మ (35), బౌలింగ్‌‌‌‌లో అన్షుల్‌‌‌‌ కాంబోజ్‌‌‌‌ (3/33) చెలరేగడంతో.. శనివారం జరిగిన గ్రూప్‌‌‌‌–బి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 7 రన్స్‌‌‌‌ తేడాతో పాకిస్తాన్‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌ నెగ్గిన ఇండియా 20 ఓవర్లలో 183/8 స్కోరు చేసింది. నేహల్‌‌‌‌ వదేరా (25), రమణ్‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (17) ఫర్వాలేదనిపించారు. 

సుఫియాన్‌‌‌‌ ముఖీమ్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత పాక్‌‌‌‌ 20 ఓవర్లలో 176/7 స్కోరుకే పరిమితమైంది. అరాఫత్‌‌‌‌ మిన్హాస్‌‌‌‌ (41) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. యాసిర్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (33), ఖాసిమ్‌‌‌‌ అక్రమ్‌‌‌‌ (27), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (25) పోరాడి విఫలమయ్యారు. రసిఖ్‌ సలామ్‌‌‌‌, నిశాంత్‌‌‌‌ సింధు చెరో రెండు వికెట్లు తీశారు.  అన్షుల్‌‌‌‌ కాంబోజ్‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. సోమవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌‌‌లో యూఏఈతో ఇండియా–ఎ పోటీ పడనుంది.