మీ వాహనాల్లో గాలి తగ్గుతుందా..! ఇదిగోండి మినీ పంప్ 

సైకిల్​ ఎండలో పెట్టినప్పుడు, టైర్​కి సన్నని రంధ్రం పడిప్పుడు మెల్లిగా గాలి తగ్గుతూ ఉంటుంది. ఊరికి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? అందుకే ఇలాంటి పోర్టబుల్​ పంప్​ని ఎప్పుడూ వెంట తీసుకెళ్లాలి. లైరొవో కంపెనీ తీసుకొచ్చిన ఈ పంప్​ పోర్టబుల్​ సైజులో ఉంటుంది. దీన్ని సైకిల్ ఫ్రేమ్​కి కూడా ఎటాచ్​ చేసుకోవచ్చు.

లేదంటే.. బ్యాక్​ప్యాక్​లో పెట్టుకోవచ్చు. అల్యూమినియంతో తయారుచేయడం వల్ల బరువు కూడా చాలా తక్కువ. ఇది 80 పీఎస్​ఐ వరకు గాలిని నింపగలదు. గాలి లీక్‌‌ కాకుండా బిగుతుగా ఉండే సీల్‌‌ ఉంటుంది. దీంతో గాలి నింపడానికి కూడా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరంలేదు. చాలా సింపుల్‌‌గా ఆపరేట్ చేయొచ్చు. 

ధర: 399 రూపాయలు