విచిత్రమైన ఫెస్టివల్..పిండితో పండుగ!..ఎందుకు ఇంత స్పెషల్..?

మన దగ్గర హోలీ రోజు గల్లీలన్నీ రంగుల మయమైనట్టు.. ఇక్కడ ఏటా డిసెంబర్​ 28న వీధులన్నీ పిండి, గుడ్ల వాసనతో నిండిపోతాయి. మనం రంగులు చల్లుకున్నట్టే వాళ్లు ఒకరిమీద ఒకరు పిండి చల్లుకుని, గుడ్లు కొట్టుకుంటారు. ఈ విచిత్రమైన ఫెస్టివల్​ను స్పెయిన్​లోని ఇబీ అనే సిటీలో దాదాపు రెండు వందల ఏండ్ల నుంచి చేసుకుంటున్నారు. దీన్ని ఎల్స్​ ఎన్ఫారినేట్స్​ పేరుతో పిలుస్తుంటారు.

అక్కడివాళ్లు దీన్ని అమాయకుల దినోత్సవంగా కూడా చెప్తుంటారు. ఈ ఫెస్టివల్​ రోజు సిటీలోని ప్రతి ఒక్కరూ మిలటరీ డ్రెస్​లు వేసుకుని మాక్​ బాటిల్​(నమూన యుద్ధం)లో బాంబులు విసిరినట్టు ఇక్కడ గుడ్లు విసురుకుంటారు. పిండి చల్లుకుని, టపాసులు పేలుస్తారు. ఈ ఫెస్టివల్​లో పాల్గొనాలంటే కొన్ని నియమాలు కూడా పాటించాలి. కచ్చితంగా ముఖానికి మాస్క్​ వేసుకోవాలి. తలకు హెల్మెట్‌‌ పెట్టుకోవాలి.ఫెస్టివల్​ తర్వాత అందరూ కలిసి వీధులను శుభ్రం చేయాలి.