ఇస్మార్ట్ శంకర్ మాదిరి : బ్రెయిన్ చిప్ వచ్చేసింది.. రాబోయే పదేళ్లలో 10 లక్షల మంది బుర్రల్లో చిప్స్

హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసి ఉంటారు కదా.. అతని బ్రెయిన్ లో కంప్యూటర్ చిప్ పెడతారు.. ఇది నిజంగా సాధ్యమేనా అనే సందేహాలు రావొచ్చు.. ఇది వాస్తవం.. ఇది నిజం.. ఇప్పుడు ప్రపంచంలో ఇది సాధ్యం అయ్యింది.. మనుషుల్లోని బుర్రల్లో కంప్యూటర్ చిప్ అమర్చబోతున్నారు.. ఇది కూడా అధికారికంగా జరగబోతుంది.. న్యూరోలింక్ పేరుతో జరుగుతున్న పరిశోధనలు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయి.. ఇదే విషయాన్ని ఎక్స్ ఓనర్ ఎలన్ మాస్క్ వెల్లడించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే న్యూరో లింక్ అమలు చేయబోతున్నాం.. రాబోయే సంవత్సరాల్లో 10 వేల మందికి.. రాబోయే పదేళ్లలో 10 లక్షల మందికి ఈ న్యూరో లింక్ అమర్చబోతున్నాం అని వివరించారు ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ స్వయంగా ప్రకటించటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది.

న్యూరో లింక్ ఎవరికి అమర్చుతారు :

న్యూరో లింక్.. ఇది బ్రెయిన్ చిప్.. ప్రస్తుతం ఈ న్యూరోలింక్ ను పక్షవాతం వచ్చిన రోగులు, శరీర అవయవాలు పని చేయని వారికి.. అల్టీమర్స్ ఉన్న వారికి అమర్చి పరిశోధనలు చేస్తున్నారు. పక్షవాతంతో మంచానికే పరిమితం అయిన కొందరు వ్యక్తులకు ఈ బ్రెయిన్ చిప్ (న్యూరోలింక్) అమర్చటం ద్వారా.. ఒక్క రోజులోనే అతను డిశ్చార్జ్ అయ్యాడు.. రెండు నెలల తర్వాత అతను వీడియో గేమ్స్ ఆడుతున్నాడని బారో న్యూరోలాజికల్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. 

నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న అలెక్స్ అనే వ్యక్తికి న్యూరో లింక్ ( బ్రెయిన్ చిప్) అమర్చటం ద్వారా.. ఇప్పుడు అతను 3డీ వస్తువులను రూపొందించడానికి అవసరం అయిన కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కోర్సు ( CAD) నేర్చుకోవటం కూడా ప్రారంభించాడని వెల్లడించింది కంపెనీ. 

బ్రెయిన్ లో చిప్ అమర్చటం ద్వారా అతను సాధారణ వ్యక్తుల మాదిరి తన జీవితాన్ని గడపగలుగుతాయని స్పష్టం చేసింది.. న్యూరో లింక్ పరిశోధనలు చేస్తున్న ప్రైమ్ అనే సంస్థ.

మరికొన్ని పరిశోధనల్లో న్యూరో లింక్ పని తీరును సైతం ప్రైమ్ స్టడీ ఇలా వివరించింది. న్యూరో లింక్ చిప్ అమర్చటం ద్వారా అమెరికాకు చెందిన అర్మాగ్ అనే వ్యక్తి తన వీల్ చైర్ ను స్వతంత్రంగా కదిలించగలిగాడని.. మిగతా వారికి తన భావాలను వ్యక్తం చేస్తున్నాడని వివరించింది. అప్పటి వరకు నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న అర్మాగ్.. ఇప్పుడు తనకు తానుగా బ్రెయిన్ చిప్ ద్వారా పని చేయగలుగుతున్నాడని స్పష్టం చేసింది ప్రైమ్ స్టడీ.. 

మొత్తానికి ఎలన్ మాస్క్ న్యూరోలింక్ అనేది అత్యంత వేగంగా మార్కెట్ లోకి రాబోతున్నది అని తేలిపోయింది. రాబోయే రోజుల్లో బుర్రల్లో కంప్యూటర్ చిప్ అనేది అత్యంత సాధారణమైన ఆపరేషన్ గా మారే అవకాశాలు కూడా లేకపోలేదు.. ఎందుకంటే రాబోయే పదేళ్లలో 10 లక్షల మందికిపైనే న్యూరో లింక్ సాధ్యం అవుతుందని ఎలన్ మస్క్ ప్రకటన అందుకు నిదర్శనం..