ఇండియాలో ఓట్ల లెక్కింపు భేష్​ : ఎలాన్ మస్క్

న్యూయార్క్: టెస్లా, స్పేస్‌ ఎక్స్ చీఫ్ ఎలాన్​ మస్క్​ఇండియాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కాలిఫోర్నియాలో ఇంకా కొనసాగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 'భారతదేశం లోక్ సభ ఎన్నికల్లో ఒక్క రోజులో 64 కోట్ల ఓట్లను ఎలా లెక్కించింది?' అనే శీర్షికతో ప్రచురితమైన కథనం స్క్రీన్‌షాట్ తో ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో.. ముఖ్యంగా కాలిఫోర్నియాలో ఓటింగ్ ముగిసి 20 రోజులైనా ఇంకా ఓట్లను లెక్కిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.