నీకు నువ్వే సాటి : మస్క్ సృష్టించిన AI ఫ్యాషన్ షో..

ప్రపంచంలో ప్రముఖ లీడర్లు, బిజినెస్ మ్యాన్లు, అగ్రనేతలు అందరూ ఓకే స్టేజ్ పైకి వచ్చి అలరిస్తే ఎలా ఉంటంది. వెరైటీ గెటప్ ల్లో ఫ్యాషన్ షో చేస్తారా? అది సాధ్యమేనా.. వాస్తవంగా సాధ్యం కావపోవచ్చు. కానీ ఏఐతో పాసిబుల్ అవుతుందని నిరుపించాడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్. ప్రపంచ అగ్ర నాయకులు వివిధ వేషధరణతో చేసిన  ర్యాంప్ వాక్ వీడియో ఎలన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

ఆ వీడియోలో ఎలన్ మస్ తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌, కెనడా ప్రధాని ట్రుడో, అమెజాన్‌ అధినేత జఫ్‌ బేజోస్‌, ఫేస్‌బుక్‌ చీఫ్‌ మార్క్‌ జుకరబర్గ్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వంటి పలువురు ప్రపంచ అగ్రనేతలు కాస్ట్యూమ్స్ తో ర్యాంప్ వాక్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్ల ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంతమంది నవ్వుకుంటూ రీ ట్విట్ చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.