2026 నాటికి మార్స్ పైకి మనుషులని పంపేందుకు : ఎలన్ మస్క్ ప్లాన్

ఎలన్ మస్క్ స్పెస్ ఎక్స్ మిషన్ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాబోయే రెండు సంవత్సరాల్లో అంగారక గ్రహంపైకి మనుషులు లేకుండా ఓ స్టార్‌షిప్ ను పంపిస్తామని.. అది విజయవంతం అయితే 2026 అక్టోబర్ నాటికి ఆస్ట్రోనాట్స్ తో కూడిన స్టార్‌షిప్ ను అంతరిక్షంలోని మార్స్( అంగారక) గ్రహం మీదకు పంపుడానికి ప్లాన్ రెడీ చేసినట్లు ఎలన్ మస్క్ ప్రకటించాడు. 

ALSO READ | Asteroid threat:నాసా అలర్ట్ : బస్సు, విమానం సైజుల్లో భూమివైపు రెండు గ్రహశకలాలు

భూమి నుంచి అంగారక గ్రహం పైకి వెళ్లడం అనేది గ్రహాల అమరికపై ఆధారం పడి ఉంటుందని ఎలన్ మస్క్ Xలో తెలిపారు. ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి జరుగుతుందని పేర్కొన్నారు. 2029 నాటికి అంగారక గ్రహంపై 10లక్షల మందిని పంపించడమే SpaceX మిషన్ లక్ష్యం. ఆ దిశగా ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌ చెందిన ఫాల్కన్-9 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలో ఓ వ్యక్తి సెప్టెంబర్ 13న స్పేస్‌ఎక్స్ కూడా చేశారు. పొలరిస్ డాన్ మిషన్‌లో భాగంగా స్పేస్‌వాక్ నిర్వహించారు.

స్పేస్‌వాక్ సందర్భంగా మస్క్ సంస్థ తయారుచేసిన స్పేస్‌సూట్‌ను అప్పుడే వారు పరీక్షించారు. అంతరిక్షంలో స్పేస్‌వాక్‌ నిర్వహించిన తొలి వ్యక్తిగా ఇస్సాక్‌మన్ చరిత్ర సృష్టించారు. 30 నిమిషాల పాటు వారు క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచారు.