Musk Gift: ఎలాన్ మస్క్ పెద్ద మనసు.. చారిటీలకు రూ. 960 కోట్ల విరాళం

వరల్డ్ రిచెస్ట్ పర్సన్.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. న్యూఇయర్ సందర్భంగా భారీ విరాళం అందించారు. రెగ్యులేటరీ ఫైలిం గ్ ప్రకారం.. పేరు తెలియని కొన్ని చారిటీ ట్రస్టులకు  ఎలాన్ మస్క్ 2లక్షల 68వేల షేర్లను దానంగా ఇచ్చారు. వీటి విలువ 112 మిలియన్ డాలర్లు.. దాదాపు రూ. 960కోట్లకు పైగా ఉంటుంది. 

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 432 బిలియన్ల డాలర్ల  నికర సంపద కలిగిన 53 ఏళ్ల మస్క్.. ట్రస్టులకు దానం చేయడం ఇదే మొదటి సారి కాదు.. ఇంతకుముందకు  కూడా పెద్దమొత్తంలో టెస్లా షేర్లను ఎలాన్ మస్క్ విరాళంగా ఇచ్చారు. 2021లో 5.7 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చారు. 

ALSO READ | Air India:ఎయిర్ ఇండియా విమానాల్లో ఫ్రీ WiFi ..ఎలా పనిచేస్తుందంటే..

2022వరకు ఎలాన్ మస్క్ సంపద 200 బిలియన్ డాలర్లకంటే తక్కువే ఉండేది. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన తర్వాత.. ఎలాన్ మస్క్ సంపద ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. తాజాగా 400 బిలియన్ డాలర్లు దాటేసింది.  ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 400 బిలియన్ డాలర్లు ( 33.20 లక్షల కోట్లు) నికర విలువను దాటి ప్రపంచంలోనే నెంబర్ వన్ బిలియనీర్ గా రికార్డు సృష్టించారు.