డోంట్ వర్రీ: X( ట్విట్టర్) లో పోర్న్ ఫ్రీ ఫీచర్: ఎలాన్ మస్క్  

ఎలాన్ మస్క్..X(గతంలో ట్విట్టర్) ను కొనుగోలు చేసినప్పటినుంచి అనేక మార్పులు తీసుకొచ్చారు. యూజర్ సబ్ స్క్రిప్షన్, లోగో మార్పులతో పాటు వివిధ ఫీచర్లను మార్పులు చేస్తూ, కొత్త ఫీచర్ల ను తీసుకొచ్చారు. అయితే ఇటీవల ఎలాన్ మస్క్ Xలో ఎడల్ట్స్ కంటెంట్, గ్రాఫిక్ పోస్టు కంటెంట్ లకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.  దీనిపై కొంత మంది వినియోగదారులు ఈ కొత్త ఫీచర్ పై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. x ప్లాట్ ఫాం లో  ఈ కొత్త ఫీచర్లో మార్పులు చేస్తూ పోర్న్ ఫ్రీ ఫీచర్ జోడిస్తానని చెప్పాడు. 

కొత్త X  రూల్స్ అండ్ రెగ్యులేషన్ .. ఈ ఫ్లాట్ ఫాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్  సెక్స్ వీడియోలు, ఫొటోలను కూడా కవర్ చూస్తుంది. ఈ ఫీచర్ ను ఎలాన్ మస్క్ అధికారికంగా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీంతో X  వినియోగదారులు ఈ ఫీచర్ పై గుర్రుగా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. బూతులు తిడుతూ పోస్ట్ లు పెట్టారు. ఇదంతా ఎలాన్స్ మస్క్  తెలియడంతో ఈ ఫీచర్ లో మార్పులు చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే వినియోగదారులు కోరుకుంటూ వీటిని షేర్ చేయొచ్చన్ని తెలిపింది. 

X  ఫ్లాట్ ఫాం మే లో కొన్ని  కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. మానిటైజేషన్ ప్రాగ్రామ్ లు, ఫుల్ వీడియోలు వంటి వివిధ రకాల కొత్త ఫీచర్లను కూడా తెచ్చింది. సబ్ స్ర్కిప్షన్ పొందిన కస్టమర్లు X ఫ్లాట్ ఫాంలో సినిమాలు, టీవీ సిరీస్ లు , పాడ్ కాస్ట్ లను షేర్ చేయొచ్చు. మానిటైజేషన్ ద్వారా డబ్బులు కూడా సంపాదించొచ్చన్న ఎలాన్ మస్క్ చెప్పారు.