Elon Musk:11 మంది పిల్లలు, ముగ్గురు భార్యలకోసం ఎలాన్ మస్క్ కొత్త భవనం.. ఖర్చు ఎంతో తెలుసా

ఎలాన్ మస్క్ టెక్ ఫౌండర్, స్పేస్ పయనీర్, ఒకప్పటి సాటర్ డే నైట్ లైవ్ హోస్ట్.. ఎప్పుడూ వివాదాస్పద యాక్టివిటీతో, స్టేట్ మెంట్లతో వార్తల్లో ఉండే వ్యక్తి.. తాజాగా మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు..అదేంటంటే.. ఎలాన్ తన 11 పిల్లలు, వారి తల్లుల కోసం ఏకంగా భారీ మొత్తంలో ఖర్చు చేసి పెద్ద భవనం కొనుగోలు చేశాడు. 

ఎలాన్ మస్క్..తన 11 మంది పిల్లలు, వారి ముగ్గురు తల్లలును ఒకే భవనంలో ఉంచాలనే కోరికతో టెక్సాస్ లోని ఆస్టిన్ లో 300 కోట్లతో 14వేల 400 చదరపు అడుగుల భవనం కొన్నాడు. ఈ భవన్ ప్రముఖ గ్రాండ్ మాన్షన్ టుస్కాన్ డిజైన్ మోడల్  కలిగి ఉంది. ఇది టెక్సాస్ లోని ఎలాన్ మస్క్ ఇంటికి కేవలం 10 నిమిషాల్లోచేరుకునే దూరంలో ఉంది. 

ఎలాన్ మస్క్ వ్యక్తి గత జీవితం ఓ స్పెషల్.. అతనికి ముగ్గురు భార్యలు, 11 మంది పిల్లలు.. 2002 నుంచి మొత్తం 12 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. అయితేమాజీ భార్య జస్టిన్ మస్క్ తో మొదటి బిడ్డ 10వారాల వయస్సులో ఇన్ ఫాంట డెత్ సిండ్రోమ్ తో చనిపోయింది. 

2008లో మస్క్, జస్టిన్ విడాకులు తీసుకునే ముందు IVF ద్వారా ఐదుగురు పిల్లలను కన్నారు.వారిలో కవలలు గ్రిఫిన్, వివియన్..మరో ముగ్గురు సాక్సన్, డామియన్,కై ఉన్నారు. ఆ తర్వాత మస్క్ బ్రిటీష్ నటి తాలాలా రిలే తో పబ్లిక్ రిలేషన్ లో ఉన్నాడు. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. 

2020 నుంచి 2022 మధ్య మస్క్.. ముజిషియన్ గ్రిమ్స్ తో మరో ముగ్గురు పిల్లలు జన్మించారు. క్లైర్ బౌచర్(X), ఎక్స్ ట్రా డార్క్ సైడెరేల్ (Y), టెక్నో మెకానికస్. అయితే గ్రిమ్స్, మస్క్ వారి పిల్లల కస్టడీపై  కేసు కోర్టులో ఉంది.  

2021లో మస్క్ , బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ లో ఎగ్జిక్యూటివ్ గా ఉన్న జిల్లిస్ తో మాస్క్ సీక్రెట్ రిలేషన్ తో కవలలు పుట్టారు. ఏడాది తర్వాత మరో బిడ్డకు జన్మనిచ్చారు.