సీతారామచంద్ర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

జమ్మికుంట, వెలుగు : ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం ఆలయ అధికారులు హుండీని లెక్కించారు. 70 రోజులకు సంబంధించి హుండీలను లెక్కించగా రూ.7.23లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో కందుల సుధాకర్ తెలిపారు. లెక్కింపులో దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి సత్యనారాయణ, మడిపల్లి వాలంటీర్లు శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.