ఎంపీ బీబీ పాటిల్‌ చేసిందేమీ లేదు : మదన్​మోహన్​రావు

సదాశివనగర్​(కామారెడ్డి),వెలుగు:  జహీరాబాద్​ సిట్టింగ్​ ఎంపీ బీబీ పాటిల్​ ప్రజలకు చేసింది శూన్యమని  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​రావు విమర్శించారు.  బుధవారం సదాశివనగర్​, రామారెడ్డి మండలాల కార్యకర్తల మీటింగ్​ సదాశివనగర్​ మండలంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..  రెండు సార్లు బీబీ పాటిల్​ ఎంపీగా గెలిచినా నియోజకవర్గంలో ఆయన ఎక్కడ కూడా పర్యటించలేదన్నారు.  ఆయా మండలాల్లో బీబీపాటిల్​ పర్యటించకపోవటమే కాకుండా అభివృద్ధి కూడా చేయలేదన్నారు.  ఈ విషయాన్ని కాంగ్రెస్​ శ్రేణులు ప్రజల్లోకి   తీసుకుపోవాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ గెలుపు కోసం ప్రతి లీడర్​, కార్యకర్త పని చేయాలన్నారు.  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.