తాడ్వాయి మండలాన్ని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే మదన్మోహన్

తాడ్వాయి వెలుగు : తాడ్వాయి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​మోహన్​ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని సోమారం, బసవన్నపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు, చిట్యాల గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ, పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి మాట్లాడుతూ...

ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే మదన్​మోహన్​ దృష్టికి తీసుకెళ్లడంతో రూ.1.75 కోట్లతో సబ్​ స్టేషన్ మంజూరు చేయించారన్నారు.  ఎన్నో ఏళ్ల చిట్యాల గ్రామస్తుల కలను నెరవేర్చారన్నారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి

ఉపాధ్యక్షుడు గైని శివాజీ,యూత్ అధ్యక్షుడు అఖిల్ రావు, టౌన్ ప్రెసిడెంట్ మెట్టు చంద్రం, మండల మహిళా అధ్యక్షురాలు బాలం భాయ్, మండల ఉపాధ్యక్షురాలు మమత పాల్గొన్నారు.