సైబర్ నేరాలపై అవగాహన

ఎల్లారెడ్డి, వెలుగు : సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్ సూచించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బుధవారం స్టూడెంట్స్​కు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గుర్తు తెలియని వారితో ఓటీపీలు, పాస్​వర్డ్​లు షేర్ ​చేసుకోవద్దని సూచించారు.

గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే లింక్స్ ​ఓపెన్ ​చేయొద్దన్నారు. అనంతరం సైబర్ ​క్రైమ్​పై అవగాహనకు సంబంధించి పోస్టర్లను రిలీజ్​చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ బొజ్జ మహేశ్, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.