కామారెడ్డి జిల్లాలో ఎలక్ట్రికల్ బైక్​లో మంటలు

కామారెడ్డి టౌన్​, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో  గురువారం ఎలక్ర్టికల్ బైక్​లో మంటలు వచ్చి కాలిపోయింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన శివకుమార్​ తన ఎలక్ర్ర్టికల్​ బైక్​పై వెళ్తుండగా మాయాబజార్​ ఏరియాకు రాగానే బైక్​లోఆకస్మికంగా పొగ వస్తుండటంతో ,  బైక్​ను ఆపి కిందకు దిగారు.

  మంటలు క్షణాల్లో ఎక్కువై  బైక్​ కంప్లీట్​గా కాలిపోయింది.  ముందుగా గుర్తించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.