వింటర్లో నిండా దుప్పటి కప్పుకున్నా చలి పెడుతుంటుంది. అలాంటప్పుడు ఇలాంటి బెడ్ వార్మర్లను వాడితే సరిపోతుంది. బెడ్ మీద దీన్ని వేసుకుని పడుకుంటే చాలా వెచ్చగా ఉంటుంది. వార్మ్‌ల్యాండ్ అనే కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ వార్మర్‌ని చాలా జాగ్రత్తగా వాడాలి. దీనికి ఏసీ కరెంట్ సప్లై ఇస్తే చాలు ఆటోమెటిక్‌గా వేడెక్కుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పి ఉన్నవాళ్లకు రిలాక్సేషన్ ఇస్తుంది.
దీన్ని -100 శాతం షాక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌తో తయారుచేశారు. ఆటో కట్ ఫంక్షన్ కూడా ఉంది. అయితే.. దీన్ని మ్యాట్రెస్ మీద మాత్రమే వాడాలి. మడత మంచం, నేలపై అస్సలు వాడకూడదు. పెంపుడు జంతువులను దీనిపై ఉంచకూడదు. పిల్లలు, వికలాంగులు, వృద్ధులను ఈ వార్మర్ మీద ఒంటరిగా పడుకోబెట్టకూడదు. పదునైన వస్తువులకు దూరంగా ఉంచాలి.
ధర : సైజును బట్టి 858 రూపాయల నుంచి మొదలు