తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక

ఆర్మూర్, వెలుగు : జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించారు. ఎన్నికల్లో  టైక్వాండో అసోసియేషన్ జిల్లా  అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన తైక్వాండో మాస్టర్ సాంబడి ప్రవీణ్, జనరల్ సెక్రటరీగా టైక్వాండో  మాస్టర్ వినోద్ నాయక్, ట్రెజరర్ గా బాణోత్ వినోద్ లను ఎన్నుకున్నారు.  రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మాల్క కొమరయ్య, రాష్ట్ర జనరల్ సెక్రటరీ. వహిద్ అలీఖాన్,  రాష్ట్ర ట్రెజరర్ మారుతి లకు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు  ధన్యవాదాలు తెలిపారు.