కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు..ప్రజావాణిలో వృద్ధ దంపతుల ఫిర్యాదు

జగిత్యాల టౌన్, వెలుగు: కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని పెగడపల్లి మండలం రాములపల్లె గ్రామానికి చెందిన ఉప్పుల లచ్చన్న-–కమలమ్మ వృద్ధ దంపతులు ప్రజావాణిలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా రాములపల్లెకు చెందిన వృద్ధ దంపతులు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

తమ పెద్ద కొడుకు  మహేందర్,  కోడలు ఉమారాణి తమకు తెలియకుండా రెండెకరాల్లో ఒక ఎకరం తన మనవరాలి పేరు మీదకు మార్చారన్నారు. ఇదేమని అడిగితే తన కొడుకు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడని, కోడలు గొంతుపై కాలు వేసి నులిమిందని, తమ కేకలు విని స్థానికులు రావడంతో వదిలేసారని కన్నీరుమున్నీరయ్యారు. తమ గోడు వెళ్లబోసుకుందామని పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో ఉన్న బట్టలు,  సామాన్లు బయట పడేసి నిప్పటించి తాళం వేశారని వాపోయారు. తమకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేడుకున్నారు. 

జగిత్యాలను కార్పొరేషన్ చేయాలి

జగిత్యాల పట్టణాన్ని కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌గా అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్రజావాణిలో భారత్‌‌‌‌‌‌‌‌ సురక్షా సమితి  లీడర్లు వినతిపత్రం ఇచ్చారు. జగిత్యాల జిల్లాకేంద్రం అయ్యాక పట్టణం నలువైపులా విస్తరించిందని, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌గా మారిస్తే అభివృద్ధి చెందుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. జిల్లాలోని బతికేపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.