తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక .. అన్న గుండెపోటుతో మృతి

తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న గుండెపోటుతో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(41) మస్కట్ దేశంలో గత 15 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో  మృతి చెందాడు.  స్వగ్రామంలో అతని అంతక్రియలు నిర్వహిస్తుండగా తమ్ముని మృతదేహంపై బోరున విలిపిస్తూ గుండెపోటుకు గురై అన్న పెద్ద నర్సింలు (45) మృతి చెందాడు.  దీంతో ఓకే చితిపై ఇద్దరికి దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇలా అన్నదమ్ములు మృతి చెందడంతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.