వేములవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి : ఎస్పీ అఖిల్ మహాజన్

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని దీన్ని పరిష్కరిస్తామని  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.  గురువారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.  స్టేషన్‌‌‌‌‌‌‌‌లో అధికారులకు, సిబ్బందికి, నూతనంగా వచ్చిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..  

స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రధానంగా పట్టణ పరిధిలో 12 లోకేషన్లు నిరంతరం భద్రత చర్యలను చేపడుతున్నామన్నారు. నాంపల్లి, నంది కమాన్, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్ ప్రాంతాల్లో  ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయన్నారు. ఎస్పీ  వెంట సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్,  ఎస్.ఐలు రమేశ్,  శ్రీనివాస్, రాజు ఉన్నారు.