ఉమ్మడి జిల్లాలో 2,247 స్కూళ్లుకు పుస్తకాలొస్తున్నయ్..!

  • ఉమ్మడి జిల్లాకు దాదాపు చేరిన పార్ట్–1 టెక్స్ట్ బుక్స్
  • నెలాఖరుకు బ్యాలెన్స్​ బుక్స్
  • స్కూల్స్ తెరిచిన వెంటనే స్టూడెంట్స్ చేతుల్లోకి.. 
  • ఈసారి పేపర్ మందం తగ్గింపు

నిజామాబాద్/ కామారెడ్డి, వెలుగు: వేసవి సెలవులు ముగిసి స్కూల్స్ రీఓపెన్​అయ్యే నాటికి ఉమ్మడి జిల్లాలోని స్కూల్స్ కు టెక్స్ట్ బుక్స్​చేరవేసేందుకు విద్యాశాఖ రెడీ అయింది. గవర్నమెంట్​ఆదేశాల మేరకు సకాలంలో స్టూడెంట్స్​కు బుక్స్​ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. నిజామాబాద్​జిల్లాకు 75 శాతం, కామారెడ్డికి 60 శాతం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే చేరాయి. ఈ నెలాఖరుకు మిగిలిన బుక్స్ ​చేరేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైన నోటు పుస్తకాలు కూడా రెండు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి.  ఎంఈఓల ద్వారా మండలాలకు అక్కడి నుంచి స్కూల్స్​కు వీటిని చేర్చనున్నారు.

మొత్తం 2,247 స్కూళ్లు

నిజామాబాద్​జిల్లాలో 1,234, కామారెడ్డిలో 1,013  కలిపి మొత్తం 2,247 లోకల్​బాడీ, గవర్నమెంట్ బడులు ఉన్నాయి.  యూ–డైస్​లో నమోదు చేసిన ప్రకారం రెండున్నర లక్షల మంది దాకా స్టూడెంట్స్​ఉన్నారు.  గవర్నమెంట్​స్కూల్స్​తో పాటు, కేజీబీవీ, మోడల్,  రెసిడెన్షియల్స్​ స్కూల్స్​లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఫ్రీగా బుక్స్​అందిస్తోంది.  ఫస్ట్ క్లాస్​నుంచి టెన్త్​ స్టూడెంట్స్ వరకు​వీటిని అందుకుంటారు.

ఈ విద్యా సంవత్సరానికి నిజామాబాద్ జిల్లాకు మొత్తం 10,17,596  టెక్స్ట్ బుక్స్​అవసరమని ఆఫీసర్లు తేల్చారు. ఇందులో 1,40,026 బుక్స్​ గోదాంలో ఉన్నాయి. పార్ట్​–1 బుక్స్​ 6,37,127 అవసరం కాగా ఇప్పటికే 4,85,258 చేరాయి. మరో 1,51,869 బుక్స్ ఈ నెలాఖరుకు అందనున్నాయి.  వీటిని మొదటి విడతగా స్టూడెంట్స్​కు సర్దనున్నారు. పార్ట్​–బీ టెక్స్ట్ బుక్స్​సెప్టెంబర్​లో అందించనున్నారు. సింగిల్​రూల్ నోట్ బుక్స్​ 1,06,580తో పాటు రఫ్​ నోట్స్ 3,33,700 చేరాయి. మరో లక్షా 80 వేల ఇండెంట్​ఉంది. 

కామారెడ్డి జిల్లాకు మొత్తం 7.57 లక్షల టెక్స్ట్ బుక్స్​ అవసరం. ఇందులో 1 నుంచి 7 క్లాసులకు 4.50  లక్షల బుక్స్​ కావాల్సి ఉండగా, 2.90 లక్షలు చేరాయి.  8,9,10 తరగతుల వారికి సెకెండ్​ ఫేజ్​లో ఇవ్వనున్నారు.  4.59 లక్షల నోటు పుస్తకాల ఇండెంట్​లో 3.68 లక్షలు జిల్లాకు అందాయి.  రెండు జిల్లాలకు బ్యాలెన్స్​బుక్స్​ఈ నెలలోనే చేరేలా ఆఫీసర్లు మానిటరింగ్​ చేస్తున్నారు.  పుస్తకాల బ్యాగ్​బరువు తగ్గించేందుకు ఈసారి పేపర్​ మందాన్ని  కొంత తగ్గించారు. 

సకాలంలో పంపిణీ

జూన్​ ఫస్ట్ వీక్​లో మండలాలకు బుక్స్ సప్లై​ చేయడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు.  ఎంఈఓలకు మొదట అందించి అక్కడి నుంచి  స్కూల్స్​కు చేర్చిన తరువాత జూన్​ 12న స్టూడెంట్స్​కు వీటిని హ్యాండోవర్​చేయనున్నారు.  టెక్స్ట్, నోటు బుక్స్​ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు. 

డిలే లేకుండా  సప్లై

స్కూల్స్​తెరిచిన వెంటనే స్టూడెంట్స్​కు బుక్స్​అందిస్తాం. జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్​లో చదువుతున్న స్టూడెంట్స్​ సంఖ్యకు అనుగుణంగా బుక్స్​ కావాలని ఉన్నతాధికారులకు నివేదించాం.  ప్రతి రోజు కొన్ని బుక్స్​ జిల్లా కేంద్రానికి వస్తున్నాయి.  వారం రోజుల్లో మండలాలకు చేరవేసి అక్కడి నుంచి స్కూళ్లలో​పంపిణీకి ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఎంఈవోలు, హెడ్ మాస్టర్లకు బుక్స్  తీసుకెళ్లాలని సూచించాం.  లోపాలు లేకుండా చూస్తాం.

రాజు, కామారెడ్డి  డీఈఓ