మెగా డీఎస్సీ టైం టేబుల్ విడుదల : ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే

తెలంగాణలో 11వేల 062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ జూన్ 28న ప్రకటించింది. దీనిప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత (సీబీఆర్‌టీ) విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిసింది. ఈ పోస్టులకు మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ఇచ్చిన షెడ్యూలు ప్రకారం 

  • జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
  •  జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
  •  జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
  • జులై 23న సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
  • జులై 24న స్కూల్ అసిస్టెంట్ - బయలాజికల్ సైన్స్ పరీక్ష
  • జులై 25న స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
  • జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  •  జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష
  • ఆగస్టు 5 వరకు మిగతా పరీక్షలను నిర్వహించనున్నారు.