ఇంట్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆరోగ్యం బాలేకున్నా, అకస్మాత్తుగా మరణించినా ఇళ్లు గడవడం కష్ణమే. ఈ నేపథ్యంలో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్న ఉద్యోగస్తులకు EPF ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI)ని ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ఎంప్లాయిస్ నామినీలకు రూ.7లక్షల వరకూ కవరేజ్ చెల్లిస్తుంది. EDLI అనేది ఉద్యోగులకు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ స్కీమ్‌గా పనిచేస్తుంది. ఉద్యోగులకు నామినీ లేనప్పుడు లీగల్ గా వారి వారసులకు కవరేజ్ అమౌంట్ అందుతుంది. దీని కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫిఎఫ్ కట్ అయ్యే ఎంప్లాయిస్ అందరికీ అటోమెటిక్ గా వర్తిస్తుంది.
ఈ పథకం కింద అనారోగ్యం, యాక్సిడెంట్స్, నార్మల్ డెర్త్ లకు కూడా కవరేజ్ ఇస్తుంది. EDLI పథకం బెనిఫిట్స్ ఉద్యోగి గత 12 నెలల జీతం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఎంప్లాయ్ చనిపోయిన టైం నాటికి12 నెలల సగటు జీతం కంటే 30 రెట్లు ఎక్కువ కవరేజ్ తో పాటు ఎక్స్ ట్రాగా 20 శాతం బోనస్ పొందుతారు. మంథ్లీ PF మినహాయింపులో, 8.3 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS), 3.67 శాతం EPF , 0.5 శాతం EDLI స్కీమ్‌కు కేటాయించబడుతుంది. ఉద్యోగి నామినీ రూ.2.5 లక్షల నుంచి రూ.7లక్షల వరకూ ఇన్సూరెస్స్ క్లైయిమ్ చేయవచ్చు. ఈ పాలసీ వర్తించడానికి ఎంప్లాయ్ కనీసం 12నెలల పాటు కంటిన్యూస్ గా పీఎఫ్ చెల్లిస్తూ ఉద్యోగిగా ఉండాలి. EDLI స్కీమ్ ఎంప్లాయ్ రిటెర్మెంట్ కు మందు చనిపోయినట్లైతేనే ఇన్సూరెన్స్ క్లైమ్ చేయవచ్చు. ఆఫీస్ లో పని చేస్తున్నారా?, సెలవులో ఉన్నారా? అనేవి పీఎఫ్ ఇన్సూరెస్ కు సంబంధం లేదు.