కరీంనగర్ సిటీలో గ్రాండ్‌గా మారథాన్ 

కరీంనగర్ టౌన్, వెలుగు:  కరీంనగర్ సైక్లింగ్ అసోసియేషన్, ఐవీవై విద్యాసంస్థల ఆధ్వర్యంలో సిటీలో ఘనంగా మారథాన్  రెండో ఎడిషన్ రన్ నిర్వహించారు. ఆదివారం అంబేద్కర్ స్టేడియం నుంచి 3కే, 5కే,10కే, 21కే రన్ కు సిటీ ప్రజల పెద్ద సంఖ్యలో హాజరైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఐవీవై విద్యాసంస్థల  చైర్మన్  పసుల మహేశ్ మాట్లాడుతూ వారంలో ఒక్కసారైనా వ్యాయామం, వాకింగ్ చేయాలని  సూచించారు.

అనంతరం మారథాన్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్  పమేలాసత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఏసీపీ నరేందర్,  అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్‌‌రెడ్డి, లక్ష్ స్కూల్  చైర్మన్ మహ్మద్ ముస్తాక్, సిద్దార్థ, ఐవీవై,  ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ, శ్రీచైతన్య డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్లు, ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్  క్యాడెట్లు, సైక్లింగ్ అసోసియేషన్  సభ్యులు  పాల్గొన్నారు.