న్యూఢిల్లీ: తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ ఎస్ జగద్రక్షకన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ ఫైన్విధించింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎంపీతో పాటు అతని కుటుంబ సభ్యులకు రూ.908 కోట్ల జరిమానా విధించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం వెల్లడించింది.
ఈ నెల 26న వెల్లడించిన తీర్పు ఉత్తర్వును అనుసరించి.. 2020 సెప్టెంబర్‌లో స్వాధీనం చేసుకున్న రూ.89.19 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసినట్లు ఫెడరల్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 76 ఏండ్ల జగద్రక్షకన్ తమిళనాడులోని అరక్కోణం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యాపారవేత్త అయిన జగద్రక్షకన్, అతని కుటుంబ సభ్యులకు సంబందించిన సంస్థలపై ఫెమా విచారణ ప్రారంభించినట్టు ఈడీ తెలిపింది.