డీఎంకే ఎంపీకి రూ.900 కోట్లకు పైగా జరిమానా

తమిళనాడులో డీఎంకే ఎంపీకి ఈడీ భారీ జరిమానా విధించింది. ఫెమా ఉల్లంఘన కేసులో  డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రూ 908 కోట్ల జరిమానా విధించింది ఈడీ. అంతేగాకుండా రూ. 89 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.

ఫెమాలో చట్టంలోని సెక్షన్ 37A ప్రకారం 2020లో  సీజ్ చేసిన రూ. 89.19 కోట్లను జప్తు చేయాలని..  రూ. 908 కోట్లు  జరిమానా విధించాలని ఆదేశించింది. ఆగస్ట్ 26న వెల్లడించిన తీర్పు ప్రకారం ఈ జరిమానా విధించినట్లు ఈడీ తెలిపింది. 76 ఏళ్ల జగత్రాచకన్ అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2021 డిసెంబర్ 1న, డిఎంకె ఎంపి జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులు  సంబంధిత కంపెనీపై ఫెమాలోని సెక్షన్ 16 కింద  నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చాయి.  ఫెమా రూల్స్ ను ఉల్లంఘించి  2017లో సింగపూర్‌లోని షెల్ కంపెనీలో  రూ. 42 కోట్ల పెట్టుబడి పెట్టారని విచారణలో తేలింది.