ప్రభుత్వ ఆదాయ వనరుగా పర్యావరణ పర్యాటకం

ఒక దేశ అభివృద్ధిలో  టూరిజం కీలకపాత్ర పోషిస్తుంది.  ఏ దేశమెళ్లినా  మనల్ని పలకరించేది,  పరవశింపచేసేది సాహస, పర్యావరణ  పర్యాటకమే. ఈ పర్యావరణ పర్యాటకం ద్వారా ప్రభుత్వాలకు ఆదాయం,  ప్రజలకు ఆనందం, ఆరోగ్యం లభిస్తుంది.  పర్యావరణ సాహస పర్యాటకం మన రాష్ట్రాన్ని  బంగారు తెలంగాణగా మారుస్తుంది.  పర్యావరణ పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు తెలంగాణలో అడుగడుగునా ఉన్నాయి.  మన జలపాతాలు విదేశీ పర్యాటకులను  సైతం ఆకర్షిస్తున్నాయి. 

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. అయితే, నిజాయతీగా  చిత్తశుద్ధితో ప్రభుత్వం చొరవచూపితే నిజంగా దీనిద్వారా కొన్ని వేలమందికి ఉపాధి, ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.  మన ఉమ్మడి పది జిల్లాలు పర్యావరణ సాహస పర్యాటక జిల్లాలుగా నిలుస్తున్నాయి.  ఈ పర్యావరణ సాహస పర్యాటకంలో  విశేష అనుభవం ఉన్నవారు,  శిక్షణ ఇస్తున్న వారి మధ్య పటిష్టమైన సమన్వయం, సహకారం ఉండాలి.  అదేవిధంగా మన సాహస పర్యాటకులు ఇతర రాష్ట్రాల బాట ఎందుకు పడుతున్నారో ఆలోచించాలి?

అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎకోటూరిజంకు అనుకూలం ఆదిలాబాద్​

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడవుల జిల్లాగా పేరు పొందింది.  ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జిల్లాను  జమ్ము కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పోలుస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.  మహారాష్ట్రకు ఈ జిల్లా సరిహద్దు కావడం వల్ల మహారాష్ట్ర పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని  సందర్శిస్తారు. ముఖ్యంగా అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎకో టూరిస్టులు అత్యధిక సంఖ్యలో  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా 4 గంటల్లో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.  అదే విధంగా రాష్ట్ర రవాణా సంస్థ కూడా బస్సులను అదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ సంఖ్యలో నడుపుతోంది.  రైలు మార్గం కూడా  ఉంది.  ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 80 కి.మీ దూరంలో ఉన్న కుంటాల జలపాతానికి బస్సు సౌకర్యం కూడా కలదు. ఈ జలపాతం రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతంగా గుర్తింపు పొందింది. 100-–135 అడుగుల ఎత్తు గల ఈ జలపాతం మల్లన్న గుండంగా పేరుపొందింది.  ఈ  కుంటాల  జలపాతానికి చేరుకోవడానికి సుమారు 450 మెట్లు దిగి  కిందకి వెళ్ళవలసి ఉంటుంది.  ఈ ప్రాంతం  అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎకోటూరిజంకు చాలా అనుకూలమైన ప్రాంతం.  ఇక్కడ ముఖ్యంగా అనేక వృక్ష సంపద ఉంది. వన్యప్రాణులు, పక్షులు  మన రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టలు విరివిగా కన్పించి కనువిందు చేస్తాయి. అదే విధంగా జింకలు,  దుప్పులు, నెమళ్ళు తదితర సాధు జంతువులతో పాటు క్రూర మృగాలైన  చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు, ముళ్ళపందులు కూడా ఈ ప్రాంతంలో తరచుగా కనిపిస్తాయి. ఇక్కడ పర్యావరణం  ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యాంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అనుకూలమైన ప్రాంతం. 

ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోండు నృత్యం​ 

కుంటాల జలపాతం చుట్టుపక్కల 6 నుంచి 8 కి.మీ దూరం ట్రెక్కింగ్​కు అనువైన ప్రాంతమే కాకుండా ఇక్కడ రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లైంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ర్యాపిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జంబులింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అనుకూలమైన ప్రాంతం.  జలక్రీడలైన ముఖ్యంగా రాఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంతో అనుకూలం.  ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే జలపాతంలో చుక్క నీరు లేనప్పుడు కూడా 2 కి.మీ దూరంలో ఉన్న అడవిలో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వల్ల  ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగి ఉంటుంది. పర్యాటకులు  కూడా ఈ ప్రకృతి రమణీయత మధ్య రాఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆస్వాదిస్తారు.  ఈ జలపాతం దగ్గర క్యాంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశం ఉండడం వల్ల రాత్రికి గుడారాల్లో బస చేసే అవకాశం పుష్కలంగా ఉంది.   స్థానిక యువతకు ఎక్కువ సంఖ్యలో శిక్షణ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతంలో డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనవరిలలో  ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించి స్థానిక యువతకు ఆదాయాన్ని కల్పించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ జలపాత ప్రాంతంలో మా సంస్థ, జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అనేక సాహస క్రీడల శిక్షణా శిబిరాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతం అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలకు చాలా అనుకూలమైనదవడం వలన ప్రభుత్వం దీన్ని గుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వలన ఎకో & అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం ద్వారా  ఆదాయాన్ని పొందుతూ అనేకమంది స్థానిక యువతకు ఉపాధిని కల్పించినట్లవుతుంది. వారి సంప్రదాయమైన నృత్యమైన గోండు నృత్యాన్ని ప్రతి క్యాంపులోనూ ప్రదర్శించి స్థానిక సంస్కృతిని లోకానికి చాటుతూ వారికి ఆదాయాన్ని సమకూర్చినట్లవుతుంది.

రాక్​ఆర్ట్​ పెయింటింగ్స్, పాండవుల గుహలు 

మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో గల రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాంధీ టైగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో గల మల్లెల తీర్థం ప్రాంతం ట్రెక్కింగ్, క్యాంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజానికి చాలా అనువైన ప్రాంతం.  కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఎలిగేందుల ఖిల్లా, రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరి ఖిల్లా, వేములవాడకు దగ్గర గల బేగంపేట గుట్టలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా గోదావరీ పరీవాహక ప్రాంతం రాఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా అనుకూలమైన ప్రాంతం. ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో అనేక ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు కోటలతోపాటు ఎకో అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టూరిజానికి అనుకూలమైన ప్రాంతాలున్నాయి. లక్నవరం చెరువు,  గూడూరు జలపాతాలు అదేవిధంగా రాక్​ ఆర్ట్​ పెయింటింగ్స్,  పాండవుల గుహలు కూడా ఈ జిల్లాలో  ఉన్నాయి. ఈ ప్రాంతంలో  అంతర్జాతీయ స్థాయి రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లైంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీలను నిర్వహించడానికి మా సంస్థ, భారతీయ  పర్వతారోహణ సంస్థ సహకారంతో అంతర్జాతీయ పర్వతారోహణ పోటీలను నిర్వహించడానికి  సన్నాహాలు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించినట్లయితే అంతర్జాతీయ గుర్తింపు రావడమే కాక స్థానిక యువతకు ఆదాయాన్ని కల్పించినట్టవుతుంది.  మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట, చర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏడుపాయలు  తదితర ప్రాంతాలు సాహస క్రీడలకు అనుకూలమైన ప్రాంతాలు. నల్గొండ జిల్లాలో గల భువనగిరి ఖిల్లా అతి పురాతనమైనది.  రంగారెడ్డిలో గల అనంతగిరి కొండలు, కవాడిపల్లి, శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాంతాలు ఎకో  టూరిజానికి అత్యంత అనువైన ప్రాంతాలు. నగరానికి అత్యంత సమీపంలో ఉన్న శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతం జలక్రీడలకి, ఏరో స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లైంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి అనువైనది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం  వలన డీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. ఈ లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కాపాడి సాహస క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై  ఉంది.

అలీసాగర్​ జలాశయంలో వాటర్​ స్పోర్ట్స్​

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమీపంలో ఉన్న మరొక జిల్లా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  పట్టణానికి 18 కి.మీ దూరంలో ఉన్న అలీసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలాశయం అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకో  టూరిజానికి పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.  ఇక్కడ గత 12 సం.లుగా స్థానిక  చైతన్య బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యువజన  సంఘం బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహిస్తూ ఉద్యానవనాన్ని కూడా పరిరక్షిస్తున్నారు.  ఇక్కడ జలాశయంలో  వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్,  స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అనుకూలంగా ఉండి  జాతీయ జలక్రీడలను నిర్వహించడానికి అత్యంత సుందరమైన ప్రాంతం. ఇక్కడ గల కొండపై అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాంపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడవిలో టైక్కింగ్​కు చాలా అనుకూలం.  అదేవిధంగా రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లైంబింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ర్యాపిలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయుటకు అనువైన రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండడం వలన ఈ ప్రాంతంలో  అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలను నిర్వహించి అనేకమంది యువతకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంపై  ప్రభుత్వం దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించడమే కాక ఈ ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి అవకాశముంది. ఇదే జిల్లాలో బడా పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మల్లారం  ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర 1.5 బిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సం.ల క్రిందటి ముశ్రాం రాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎంతో అనువైనవి.

సాహస క్రీడలకు హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖమ్మం

ఖమ్మం జిల్లా సాహస క్రీడలకు హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఇక్కడి జిల్లా పర్యాటక శాఖాధికారులు దీపు కార్తికేయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న  సుమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి చొరవతో ఖమ్మం జిల్లాలో సాహస క్రీడలకు మంచి పునాది ఏర్పడింది.  ఖమ్మం ఖిల్లా పాలేరు జలాశయం,  వైరా  జలాశయం జాతీయస్థాయి జలక్రీడలను నిర్వహించడానికి అనువైనవి.  ఈ ప్రాంతంలో బోటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇతర క్యాంప్​ సౌకర్యాలను కల్పించినట్లయితే ఎక్కువ శాతం స్థానిక యువతకు ఆదాయాన్ని  కల్పించినట్లవుతుంది.  ఖమ్మం జిల్లా భద్రాచలానికి దగ్గరలోని మోతుగూడెం అడవిని స్విట్టర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖమ్మం జిల్లాగా అభివర్ణించవచ్చు. ఈ అటవీ ప్రాంతంలో అనేక వనమూలికలు, జలపాతాలు,  సెలయేర్లు, అడవి జంతువులు గల అడవిలో  ట్రెక్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం సాహస ప్రియులకు చాలా ఇష్టం.  దీన్ని అభివృద్ధి చేయడం వలన స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చు.  డొంకరాయి జలపాతం, అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సీలేరు,  లోయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీలేరు అనుకూలమైన ప్రాంతాలు.  ఇక్కడ చేసే ప్రాంతీయ  లంబాడా నృత్యం, కొమ్ము డాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రతి అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంపులోనూ  ప్రదర్శించడం వలన ఇక్కడి సంస్కృతి అందరికీ  తెలియజేయడమే కాక ఆ కళను నమ్ముకున్నవారికి ఉపాధి చూపించినట్టవుతుంది.

- కె.రంగారావు ఫౌండర్, ఏసీటీఎస్