టూల్స్ గాడ్జెట్స్ : పాకెట్​ ఫ్రెండ్లీ రెయిన్​ కార్డ్​

పాకెట్​ ఫ్రెండ్లీ రెయిన్​ కార్డ్​

ఎకోస్పిట్​ యునిసెక్స్​ అడల్ట్​ రెయిన్​కార్డ్​. ఈ రెయిన్​కార్డ్​ను విజిటింగ్​ కార్డ్​లా పర్సులో పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. పలురకాల రంగుల్లో ఉన్న ఇవి ప్రయాణాలకు బాగా ఉపయోగంగా ఉంటాయి. మందపాటి మెటీరియల్​తో తయారైనా కూడా ఫ్లెక్సిబుల్​గా ఉంటాయి. సాధారణంగా అయితే డిస్పోజబుల్​ ప్రొడక్ట్స్​ కొన్నిసార్లు వేసుకుంటుంటేనే చిరిగిపోతాయి. అంతేకాకుండా ఒకసారి వాడి పడేయడం వల్ల పర్యావరణానికి కూడా మంచిది కాదు. కానీ ఈ రెయిన్​కార్డ్​ను మాత్రం ఒకసారి పారేయాల్సిన అవసరంలేదు. మళ్లీ మళ్లీ వాడొచ్చు. బ్యాక్​ప్యాక్​ మీద కూడా ఈ రెయిన్​ కోట్​ వేసుకోవచ్చు. సాధారణంగా జర్నీ చేసేటప్పుడు గొడుగు లేదా పెద్ద రెయిన్​కోట్ పట్టుకెళ్లాలంటే బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇవి తీసుకెళ్తే స్పేస్​ ఆదా అవుతుంది. బరువు సమస్యా ఉండదు​. ఇసి ఎవా కంపెనీ తయారుచేసిన ఈ లైట్​వెయిట్​ రెయిన్​కోట్​ జాకెట్​ వర్షంలో వాడిన ప్రతిసారి బాగా ఆరబెట్టాలి. ఆరిన తరువాతనే మడతపెట్టి దాచుకోవచ్చు. దీని తయారీకి వాడిన మెటీరియల్​ వల్ల దీన్నుంచి ఎటువంటి వాసన ఉండదు. ఇది నాన్​టాక్సిక్​ పీవీసీ మెటీరియల్​తో తయారైంది. తల నుంచి మోకాళ్ల కింద వరకు తడవకుండా వర్షం వల్ల మీ పనులు ఆగిపోకుండా సాగిపోవచ్చు. 

ధర: 49 రూపాయలు

వర్షంలో రయ్​ రయ్

వర్షం పడుతున్నప్పుడు రెయిన్​కోట్​ వేసుకుని టూ వీలర్​  డ్రైవింగ్​ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే రెయిన్​కోట్​ కొంత మేరకు మాత్రమే తడవకుండా కవర్​ చేస్తుంది కాబట్టి. రెయిన్​ కోట్​ వేసుకున్నా చేతులు, ముఖం ఎంతోకొంత తడుస్తాయి. అలాకాకుండా లేసిన్​ కంపెనీ తయారుచేసిన ఈ రెయిన్​కోట్​ అయితే మిమ్మల్నే కాదు... అంతో ఇంతో మీ వెహికల్​ను కూడా తడవకుండా చేస్తుంది. వాటర్​ప్రూఫ్​తో తయారైన ఈ రెయిన్​కోట్​ తల నుంచి మెడను కప్పుతూ చేతుల మీదుగా వచ్చి మోకాళ్ల కింద వరకు ఉంటుంది. అందుకని తల దగ్గర నుంచి పాదాల వరకు తడవకుండా కవర్​ చేస్తుంది. బండి హ్యాండిల్​, ముందు భాగాన్ని కూడా వకర్​ చేస్తూ వేసుకోవాలి కాబట్టి. బండి ముందు భాగం కూడా తడవదు. దీన్ని పొడవుగా ఉండే మోటార్​సైకిల్​, బైక్​, స్కూటర్​ డ్రైవింగ్​కు వాడొచ్చు. ​ఎంత భారీ వర్షం వచ్చినా, గాలులు వీచినా స్ట్రాంగ్​గా ఉండేలా తయారుచేసింది కంపెనీ. దీన్ని క్యారీ చేయడం చాలా ఈజీ. ఈ రెయిన్​కోట్​ని బండి నడిపే వాళ్లతో పాటు వెనక కూర్చున్న వాళ్లు కూడా వేసుకోవచ్చు. వెహికల్​ నడిపేటప్పుడే కాకుండా థీమ్​ పార్క్,​ క్యాంపింగ్​, హైకింగ్​ వంటి వాటికి వెళ్లినప్పుడు కూడా దీన్ని వాడొచ్చు.

 ధర: 1,999 రూపాయలు

షూ తడవకుండా..​​

వానాకాలం షూస్​ వేసుకునే వాళ్లకు ఒక పెద్ద పరీక్షలా ఉంటుంది. ఇలాంటప్పుడు షూస్​ తడిచి పాడుకాకుండా కవరింగ్​ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వాటర్​ప్రూఫ్​ సిలికాన్​ షూస్​ కవర్స్ మార్కెట్​లోకి తెచ్చింది ఓం టాయ్​ జోన్. 140 గ్రాముల బరువు ఉండే ఈ కవర్స్​ని ఒకసారి వాడాక పడేయాల్సిన అవసరం లేదు. మళ్లీ వాడుకోవచ్చు. కాకపోతే వాడిన వాటిని పొడి బట్టతో తుడిచి పక్కన పెట్టాలి. మరి షూస్​ తడవనీయదు ఈ కవర్​ అంటే నేలమీద నడుస్తుంటే జారిపోదా అనే డౌట్​ రావచ్చు. నాన్​ స్లిప్పరీగా తయారుచేశారు. కాబట్టి జారే అవకాశం ఉండదు అంటోంది కంపెనీ. షూ సైజ్​ బట్టి కవర్​ ఎంపిక చేసుకోవాలి. వర్షాకాలంలో షూ పాడుకాకుండా ఉండేందుకు ఇవి చాలా బాగా పనికొస్తాయి. 

ధర: 189 రూపాయలు

యాక్టివాకి రెయిన్ కోట్​

వర్షాకాలంలో వానకు తడిచి యాక్టివా వెహికల్​ పాడవకుండా ఉండాలంటే రెయిన్​కోట్​ వేయాల్సిందే! వైటల్​ క్రియేషన్స్​ తయారుచేసిన ఈ కవర్​ యాక్టివా 5జి,  6జి మోడల్స్​కి వస్తుంది. వర్షానికి తడవకుండానే కాకుండా మామూలు రోజుల్లో బండి మీద గీతలు పడకుండా, ఎండకు రంగు మారిపోకుండా... ఒక్కమాటలో చెప్పాలంటే బండి రంగు, రూపు మారకుండా ప్రొటెక్ట్​ చేస్తుంది. దీన్ని వేయడం వల్ల హ్యాండిల్స్​ మీద దుమ్ము పడదు. సీట్​ కవర్​ పాడు కాదు. వర్షాకాలంలో అయితే ఇండికేటర్​, స్పీడోమీటర్లు వానకి తడిచి పాడుకావు. ఇది రకరకాల రంగుల్లో దొరుకుతోంది. హ్యాండిల్​కు ఈ కవర్​ ఎలా ఫిట్​ చేయాలంటే మొదట సైడ్​ మిర్రర్స్​ తీసి హ్యాండిల్​ కవర్​ వేయాలి. ఆ తరువాత మిర్రర్​ హోల్​ని అడ్జస్ట్​ చేయాలి. మిర్రర్​ హోల్​ దగ్గర షార్ప్​​ టూల్​తో లోపలికి ఫిట్​ చేయాలి. అదెలా ఫిట్​ చేయాలనేది ఇక్కడ బొమ్మలో ఉంది. దాన్ని చూస్తూ ఈజీగా ఫిక్స్​ చేసుకోవచ్చు. వెహికల్​ ఇండికేటర్​, హ్యాండిల్, సీట్​... ఇలా​ అన్ని పార్ట్స్​కి సరిపడే కోంబో ఇది. 

ధర: 549 రూపాయలు